JEE Mains: జేఈఈ మెయిన్స్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

జేఈఈ మెయిన్స్‌ తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబరు 4వ తేదీ (రాత్రి 9 గంటల) వరకు పొడిగించారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సవరించిన కాలపట్టికను వెల్లడించింది.

Updated : 01 Dec 2023 07:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్స్‌ తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబరు 4వ తేదీ (రాత్రి 9 గంటల) వరకు పొడిగించారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సవరించిన కాలపట్టికను వెల్లడించింది. ముందుగా ప్రకటించిన గడువు గురువారం రాత్రితో ముగియగా.. దాన్ని డిసెంబరు 4వ తేదీ వరకు పొడిగించింది. సమర్పించిన దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే వెబ్‌సైట్‌లో డిసెంబరు 6 నుంచి 8వ తేదీ వరకు సవరించుకోవచ్చని ఎన్‌టీఏ పేర్కొంది. తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు జనవరి 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని