జనసంద్రంగా జాతీయ రహదారి

గన్నవరం విమానాశ్రయం నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి దూరం 26 కిలోమీటర్లు. దీనికి ప్రయాణసమయం గంట మాత్రమే.

Published : 02 Dec 2023 03:07 IST

విమానాశ్రయంలో, ఇంటి వద్ద చంద్రబాబుకు ఘనస్వాగతం

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, తాడేపల్లి: గన్నవరం విమానాశ్రయం నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి దూరం 26 కిలోమీటర్లు. దీనికి ప్రయాణసమయం గంట మాత్రమే. కానీ... తెదేపా అధినేత చంద్రబాబు ప్రయాణానికి శుక్రవారం దాదాపు 5.15 గంటల సమయం పట్టింది. తన వాహనం ఫుట్‌రెస్ట్‌పై నిలబడి తెదేపా కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. హైదరాబాద్‌లో వైద్యపరీక్షల అనంతరం ఆయన తొలిసారి విజయవాడకు వచ్చారు. తిరుపతి నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం లభించింది. ప్రజలు జాతీయ రహదారికి ఇరువైపులా బారులు తీరి పూల వర్షం కురిపించారు. దీంతో జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. కాన్వాయ్‌ను వేగంగా వెళ్లనివ్వాలని పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేయగా.. మహానాడు జంక్షన్‌ నుంచి కార్యకర్తల ర్యాలీ నిలిపివేశారు. కేవలం చంద్రబాబు కాన్వాయ్‌నే నగరంలోకి పంపారు. మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ప్రత్యేక విమానం తిరుపతి నుంచి గన్నవరం చేరుకుంది.

చంద్రబాబుకు ఉండవల్లిలోని ఆయన నివాసం వద్ద రాజధాని రైతులు, తెదేపా కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం ఘనస్వాగతం పలికారు. ‘జై బాబు జైజై బాబు’.. ‘సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి’ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. రాత్రి 8 గంటల వరకు పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నివాసం వద్దనే ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని