Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతే

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. దాని మాస్టర్‌ప్లాన్‌కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించింది. ‘పట్టణ పరిపాలన, నగరాల దీర్ఘకాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ అత్యవసరం.

Updated : 05 Dec 2023 08:05 IST

మాస్టర్‌ ప్లాన్‌కు కేంద్రం ఆమోదం
రాజ్యసభలో పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి వెల్లడి

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతేనని(Amaravati) కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. దాని మాస్టర్‌ప్లాన్‌కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించింది. ‘పట్టణ పరిపాలన, నగరాల దీర్ఘకాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ అత్యవసరం. దేశంలోని 39% రాష్ట్రాల రాజధానులకు క్రియాశీలక మాస్టర్‌ప్లాన్‌ లేదన్నది వాస్తవమేనా’ అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జావెద్‌ అలీఖాన్‌ సోమవారం రాజ్యసభలో ప్రశ్నించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్‌ కిశోర్‌ బదులిస్తూ అమరావతిని ఏపీ రాజధానిగా పేర్కొన్నారు. ‘రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌ ప్రకారం పట్టణ ప్రణాళిక.. పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల విధి. పట్టణ స్థానిక సంస్థలు, రాష్ట్రాలు వివిధ పథకాల ద్వారా చేపట్టే పనులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహకరిస్తుంది. సాంకేతికంగా, ఆర్థికంగా చేయూతనిస్తుంది. ప్రస్తుత సమాచారం మేరకు దేశంలోని 28 రాష్ట్రాలకుగానూ 26 రాష్ట్రాల రాజధానులకు ‘ఆమోదించిన మాస్టర్‌ప్లాన్‌’లు ఉన్నాయి. ఇలా ఆమోదం పొందిన వాటిలో ఏపీ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ కూడా ఉన్నాయి. కోహిమా (నాగాలాండ్‌), అగర్తలా (త్రిపుర) మాస్టర్‌ప్లాన్‌లకు మాత్రమే ఆమోదం లేదు’ అని కేంద్ర మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని