7 గంటల్లోనే ఆర్‌యూబీ నిర్మాణం

విశాఖ-విజయనగరం రైలు మార్గంలో కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద 477 రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ (గేటు) స్థానంలో రైల్వే అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణాన్ని కేవలం ఏడు గంటల్లో పూర్తిచేశారు.

Published : 05 Dec 2023 03:35 IST

విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద పనులు

కొత్తవలస, న్యూస్‌టుడే: విశాఖ-విజయనగరం రైలు మార్గంలో కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద 477 రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ (గేటు) స్థానంలో రైల్వే అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణాన్ని కేవలం ఏడు గంటల్లో పూర్తిచేశారు. ఇందుకోసం సోమవారం కొత్తవలస-విజయనగరం మధ్య రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఉదయం 8 గంటలకు పనులు మొదలుపెట్టారు. ఇక్కడ మొత్తం ఆరు లైన్లు ఉండగా.. ప్రధానమైన అప్‌, డౌన్‌, మిడిల్‌ (2, 3, 4) మార్గాల్లో పట్టాలను తొలగించారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన కాంక్రీట్‌ బ్లాక్‌లను వాటి కింద క్రేన్ల సాయంతో బిగించారు. కట్‌ అండ్‌ కవర్‌ పద్ధతిలో పనులు చేపట్టి మధ్యాహ్నం 3 గంటలకల్లా పూర్తిచేశారు. 200 మంది కార్మికులతో పాటు రైల్వే అధికారులు నిర్విరామంగా శ్రమించి అనుకున్న సమయానికి పట్టాలు పునర్నిర్మించి, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. వాల్తేరు డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌ పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని