ఇప్పటికైనా మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి: అమరావతి రైతులు

రాష్ట్ర రాజధాని అమరావతిగా కేంద్రం మరోసారి పేర్కొందని, ఇప్పటికైనా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అమరావతి అన్నదాతలు కోరారు.

Published : 05 Dec 2023 03:35 IST

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర రాజధాని అమరావతిగా కేంద్రం మరోసారి పేర్కొందని, ఇప్పటికైనా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అమరావతి అన్నదాతలు కోరారు. మందడం శిబిరంలో ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు చేస్తున్న నిరసనలు సోమవారానికి 1,448వ రోజుకు చేరాయి. వారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి సహా దేశంలోని రాష్ట్రాల రాజధానులకు మాస్టర్‌ ప్లాన్‌ ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిషోర్‌ రాజ్యసభలో తెలిపారన్నారు. అందువల్ల వెంటనే ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని