తిరుమలలో వర్షాలు

తుపాను ప్రభావంతో తిరుమలలో కురుస్తున్న వర్షాలు, పొగమంచుతో భక్తులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సోమవారం శ్రీవారి దర్శనానికి వచ్చిన తిరుపతికి చెందిన భక్తుడు విజయ్‌కుమార్‌ జారి కిందపడటంతో కాలు విరిగింది.

Updated : 05 Dec 2023 06:42 IST

తిరుమల, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో తిరుమలలో కురుస్తున్న వర్షాలు, పొగమంచుతో భక్తులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సోమవారం శ్రీవారి దర్శనానికి వచ్చిన తిరుపతికి చెందిన భక్తుడు విజయ్‌కుమార్‌ జారి కిందపడటంతో కాలు విరిగింది. కొండపై ఉన్న అతిథిగృహాలు, రెండు ఘాట్‌ రోడ్లు, పాపవినాశనం రోడ్డు, శ్రీవారి మెట్టుమార్గంలో పలుచోట్ల భారీ చెట్లు కూలడంతో రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. పాపవినాశనం, శ్రీవారిమెట్టు, కపిలతీర్థం, జాపాలి మార్గాలను తితిదే మూసివేసింది. ఘాట్‌రోడ్లలో ద్విచక్రవాహనదారులకు పరిమితులు విధించారు. తిరుమలలోని జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని