AP Students: మరుగుదొడ్లకు తలుపులు లేవ్‌.. ప్రభుత్వ కళాశాల విద్యార్థినుల ధర్నా

‘మరుగుదొడ్లకు తలుపులు లేవు. కరెంటు లేకపోతే నీళ్లు రావు. దీని గురించి ప్రిన్సిపల్‌ పట్టించుకోవడం లేదు. లేనిపోని నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

Updated : 05 Dec 2023 08:51 IST

వై.రామవరం, న్యూస్‌టుడే: ‘మరుగుదొడ్లకు తలుపులు లేవు. కరెంటు లేకపోతే నీళ్లు రావు. దీని గురించి ప్రిన్సిపల్‌ పట్టించుకోవడం లేదు. లేనిపోని నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాగైతే ఎలా చదువుకోగలం’ అంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం పి.ఎర్రగొండ గురుకుల కళాశాల విద్యార్థినులు వర్షంలో ఆందోళనకు దిగారు. సోమవారం కళాశాల ఎదుట ధర్నా చేశారు. ‘వసతిగృహంలో 12 మరుగుదొడ్లు ఉండగా.. రెండింటికి మాత్రమే తలుపులున్నాయి. మిగతా వాటికి లేకపోవడంతో 5 నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దీనిపై ప్రిన్సిపల్‌కి చెప్పినా పట్టించుకోవడం లేదు’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని