రోడ్లకు రూ.2 వేల కోట్ల నష్టం

మిగ్‌జాం తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో 3,700 కి.మీ.మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.

Published : 07 Dec 2023 04:10 IST

3,700 కి.మీ. రహదారులు ధ్వంసమైనట్లు అధికారుల అంచనా

ఈనాడు, అమరావతి: మిగ్‌జాం తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో 3,700 కి.మీ.మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి తాత్కాలిక మరమ్మతులు, శాశ్వత పనులు చేపట్టడానికి మొత్తం రూ.2 వేల కోట్లు అవసరమవుతుందని అంచనా వేశారు. 85 చోట్ల రోడ్లు కోతకు గురవడంతో పాటు 12 చోట్ల కొట్టుకుపోయాయని, 530 చెట్లు రోడ్లపై విరిగిపడగా.. 130 చోట్ల రహదారులపై వర్షం నీరు ప్రవహించినట్లు తెలిపారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.200 కోట్లు, శాశ్వత పనులకు రూ.1,800 కోట్లు వ్యయమవుతుందని ఇంజినీర్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి బుధవారం నివేదిక పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో బుధవారం కూడా వానలు కురవడంతో దెబ్బతిన్న రోడ్ల విస్తీర్ణం మరికొంత పెరిగే వీలుందని భావిస్తున్నారు.

తిరుపతి, ఎన్టీఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో 123.51 కి.మీ. మేర పంచాయతీరాజ్‌ రోడ్లు (పీఆర్‌) ధ్వంసమైనట్లు తెలిపారు. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.1.89 కోట్లు, శాశ్వత పనులకు రూ.77.15 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. మిగిలిన జిల్లాల్లోనూ పీఆర్‌ రోడ్లు దెబ్బతినగా వాటి నివేదిక ఇంకా సిద్ధం కాలేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని