నిండా మునిగిన వరి రైతు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 20 శాతం ధాన్యం కూడా ఇప్పటి వరకు తరలించలేదు.

Published : 07 Dec 2023 04:12 IST

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 20 శాతం ధాన్యం కూడా ఇప్పటి వరకు తరలించలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో కల్లాల్లో ధాన్యం తడిసిపోయి మొలకలొచ్చాయి. పైర్లు మునిగిపోయాయి. బాపట్ల జిల్లాలో 72 వేల హెక్టార్లలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట తుపానుకు తుడిచిపెట్టుకుపోయింది. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలకు 56,254 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అనకాపల్లి జిల్లాలో 32 వేల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగి నీట మునిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పొలాల్లో ధాన్యం రాశులుంటే తడిసిపోతాయనే భయంతో డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కొత్తపేట మండలం అవిడిలోని జగనన్న లేఅవుట్‌కు సుమారు 50 ఎకరాల్లోని ధాన్యాన్ని తరలించారు. మంగళవారం రాత్రి భారీ వర్షానికి లేఅవుట్‌ అంతా మునిగి, ధాన్యం రాశులన్నీ తడిసిపోయాయి.


జలదిగ్బంధంలో పోలవరం పునరావాస కాలనీ

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామమైన దేవీపట్నం ప్రజలకు తూర్పుగోదావరి జిల్లా గోకవరం శివారు గంగాలమ్మ ఆలయం సమీపంలో నిర్మిస్తున్న పునరావాస కాలనీ భారీ వర్షాలకు  నీటమునిగింది. పునరావాస కాలనీని మునిగేచోట నిర్మిస్తే ఎలాగని నిర్వాసితులు మండిపడ్డారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని