Bhimavaram: భీమవరంలో రేవంత్‌ వియ్యంకుడి ఇంట సందడి

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన వియ్యంకుడి ఊరైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సందడి నెలకొంది.

Updated : 07 Dec 2023 08:34 IST

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన వియ్యంకుడి ఊరైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సందడి నెలకొంది. రేవంత్‌రెడ్డి వియ్యంకుడు, రెడ్డి అండ్‌ రెడ్డి మోటార్స్‌ షోరూం అధినేత వెంకటరెడ్డి నివాసం వద్ద బుధవారం బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులు ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని