అంబేడ్కర్‌ స్ఫూర్తితో దళితుల సంక్షేమం

బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో దళితుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత దీక్షతో కొనసాగిద్దామని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

Published : 07 Dec 2023 04:18 IST

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో దళితుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత దీక్షతో కొనసాగిద్దామని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. బుధవారం అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబు, పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. బీ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి అంబేడ్కర్‌ అని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కొనియాడారు.

8, 9 తేదీల్లో బాపట్ల, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

గుంటూరు (పట్టాభిపురం), న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాను ప్రభావిత ప్రాంతాలైన బాపట్ల, గుంటూరు జిల్లాల్లో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 8, 9 తేదీల్లో పర్యటించనున్నారు. అన్నదాతలను పరామర్శించి ధైర్యం చెప్పి భరోసా కల్పించేందుకు చంద్రబాబు రెండు రోజులు పాటు బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 8న బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలంలోని గోవాడ ప్రాంతాల్లో పంటల్ని పరిశీలిస్తారు. బాపట్ల జిల్లాలోని కర్లపాలెం సహా మరో రెండు మూడు గ్రామాల్లో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించి రాత్రికి బాపట్లలో బస చేస్తారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. ఈనెల 9వ తేదీన బాపట్ల నుంచి పర్చూరుకు చేరుకొని మిర్చి, పొగాకు పంటలను పరిశీలిస్తారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడులో పంట పొలాలను పరిశీలిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని