చంద్రబాబు బెయిల్‌ పిటిషన్లపై విచారణ 12కి వాయిదా

ఉచిత ఇసుక విధానం, రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Updated : 07 Dec 2023 06:12 IST

ఈనాడు, అమరావతి: ఉచిత ఇసుక విధానం, రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో ముందస్తు బెయిలు కోసం ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ ఈ నెల 12కి వాయిదా పడింది. సీఐడీ తరఫున వాదనలు వినిపించేందుకు ఏజీ శ్రీరామ్‌ హాజరు అవుతారని.. విచారణను 12వ తేదీకి వాయిదా వేయాలని అదనపు పీపీ దుష్యంత్‌రెడ్డి కోరారు. దీంతో విచారణను వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ వ్యాజ్యాల్లో పిటిషనర్‌ తరఫున వాదనలు ఇప్పటికే ముగిసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని