చికిత్స వ్యయం మరో రూ.20 లక్షలకు పెంపు

ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు వ్యయమయ్యే చికిత్సను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు.

Published : 07 Dec 2023 04:19 IST

మంత్రి విడదల రజిని

ఈనాడు, అమరావతి: ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు వ్యయమయ్యే చికిత్సను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నామని, దీనికి అదనంగా మరో రూ.20 లక్షల వరకు పెంచుతున్నామన్నారు. వచ్చేనెలలో ప్రారంభం కానున్న జగనన్న మలివిడత ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కార్యకలాపాలపై అధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారిక ప్రకటన విడుదలైంది. ‘ఆరోగ్యశ్రీ ద్వారా కొత్త కార్డులను 1.43 కోట్ల కుటుంబాలకు సచివాలయాల ద్వారా ఈ నెల 18 నుంచి పంపిణీ ప్రారంభమవుతుంది. కొత్త కార్డుల్లో ఆయుష్మాన్‌ భారత్‌ నంబరు కూడా ఉంటుంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందిన రోగుల ఆరోగ్య వివరాలను డిజిటలైజేషన్‌ చేస్తాం. ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ ఫిజిషియన్‌, జగనన్న ఆరోగ్య సురక్ష కింద చికిత్స పొందినప్పటికీ అందుకు సంబంధించిన వివరాలు కార్డుల్లో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని