స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త సాఫ్ట్‌వేర్‌, మొబైల్‌ యాప్‌

స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌, మొబైల్‌ అప్లికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందిస్తోంది.

Published : 07 Dec 2023 04:26 IST

ఈనాడు, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌, మొబైల్‌ అప్లికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందిస్తోంది. ఆ సంఘం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ అన్ని జిల్లాల కోడ్‌లతో పాటు డివిజన్‌, మండల, గ్రామాలకు కేటాయించిన కోడ్‌ వివరాలను ఆ కార్యాలయానికి పంపించింది. పరిపాలనా చర్యల్లో భాగంగా గతంలో జిల్లా కేంద్రాల నుంచి గ్రామాల వరకు కేటాయించిన కోడ్‌ల ఆధారంగానే ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు కమిషన్‌ కార్యాలయంలో జరుగుతున్న కంప్యూటరీకరణ చర్యల్లో భాగంగా కొత్త సాఫ్ట్‌వేర్‌, మొబైల్‌ అప్లికేషన్‌ను ఎన్నికల సంఘం సిద్ధం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని