వివేకా హత్య కేసులో అభియోగాల నమోదుపై 20న విచారణ

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులపై అభియోగాల నమోదు నిమిత్తం సీబీఐ కోర్టు.. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

Updated : 07 Dec 2023 06:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులపై అభియోగాల నమోదు నిమిత్తం సీబీఐ కోర్టు.. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. నిందితులైన టి.గంగిరెడ్డి అలియాస్‌ ఎర్ర గంగిరెడ్డి, యాదాటి సునీల్‌యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌, డి.శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డిలను బుధవారం జైలు నుంచి హాజరుపరిచారు. వీరి రిమాండ్‌ను పొడిగిస్తూ సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి సీహెచ్‌.రమేశ్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. 4వ నిందితుడైన దస్తగిరి, పార్లమెంట్‌ సమావేశాలున్నందున అవినాష్‌రెడ్డిలు హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తులను అనుమతించారు. తనను నిందితుల జాబితా నుంచి తొలగించి సాక్షిగా పరిగణించాలని కోరుతూ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌లో సీబీఐతో సహా ప్రతివాదులు కౌంటరు దాఖలు చేయకపోవడంతో చివరిగా మరో అవకాశమిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ నెల 20లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని