సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై దృష్టి పెట్టండి

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ సూచించారు.

Published : 07 Dec 2023 04:28 IST

తుపాను సహాయ చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు-అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ సూచించారు. ‘తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. కలెక్టర్లు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు బాగా పనిచేశారు’ అని ప్రశంసించారు. తుపాను సహాయక చర్యలపై ప్రభావిత జిల్లాల అధికారులతో బుధవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి మాట్లాడారు. ‘తుపాను బాధితులకు సాయం విషయంలో ఎలాంటి లోటూ రాకుండా చూసుకోవాలి. సానుభూతితో వ్యవహరించాలి. వర్షాలతో ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.10 వేలు ఇవ్వడం, ముంపు బారిన పడిన లోతట్టు ప్రాంతాల పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే వారికి సాయం, రేషన్‌ పంపిణీలో ఎలాంటి లోటూ రాకూడదు’ అని సూచించారు. ‘పొలాల్లో వరద నీటిని తొలగించడంపై దృష్టి పెట్టాలి. పంటల రక్షణ, పరిహారం, తడిసిన ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం అండగా ఉంటుంది. 80% రాయితీపై విత్తనాల సరఫరాకు సిద్ధం కావాలి’ అని ఆదేశించారు. ‘విద్యుత్తు, రహదారుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలి’ అని చెప్పారు. విధి నిర్వహణలో ఉండగా చెట్టుకూలి ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.30 లక్షల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు