జగన్‌ ప్రభుత్వమా.. మజాకా

వాహనాల రద్దీ పెరిగే కొద్దీ గ్రామీణ రహదారులను జిల్లా రహదారులుగా, రాష్ట్ర రహదారులుగా, జాతీయ రహదారులుగా ఉన్నతీకరించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి.

Updated : 07 Dec 2023 06:24 IST

35 రాష్ట్ర రహదారుల స్థాయి తగ్గింపు

ఈనాడు, అమరావతి: వాహనాల రద్దీ పెరిగే కొద్దీ గ్రామీణ రహదారులను జిల్లా రహదారులుగా, రాష్ట్ర రహదారులుగా, జాతీయ రహదారులుగా ఉన్నతీకరించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. వైకాపా ప్రభుత్వం మాత్రం 35 రాష్ట్ర రహదారుల స్థాయి తగ్గించి జిల్లా రహదారులుగా రీ-క్లాసిఫికేషన్‌ చేస్తూ తాజాగా ఉత్తర్వు జారీచేసింది. దీనివల్ల ఆయా రోడ్లలో 1,409 కిలోమీటర్లు ఇకపై ప్రధాన జిల్లా రహదారులుగా మారినట్లు అయింది.

నిధులివ్వడం చేతకాక

దారుణంగా ఉన్న 3,432 కి.మీ.లను రెన్యువల్‌ చేసేందుకు రూ.1,121.92 కోట్లకు పరిపాలన అనుమతులిస్తూ జులైలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అన్ని జిల్లాల్లో టెండర్లకు కూడా పిలిచారు. వీటికి నిధులు ఎలా సమకూరుస్తారో స్పష్టత లేకపోవడంతో గుత్తేదారులు పనులు చేయడానికి ముందుకు రావడంలేదు. దీంతో నాబార్డ్‌ నుంచి రుణం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర రహదారులకు నాబార్డ్‌ రుణం ఇచ్చే అవకాశం లేకపోవడంతో 35 రాష్ట్ర రోడ్లను జిల్లా రహదారులుగా స్థాయి తగ్గించినట్లు తెలుస్తుంది. ఇది తాత్కాలికమే అని మళ్లీ వాటిని రాష్ట్ర రహదారులుగా గుర్తిస్తారని ఇంజినీర్లు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని