ఐఏఎస్‌లకు జైలు శిక్ష అమలు నిలిపివేత

కోర్టుధిక్కరణ కేసులో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌లకు హైకోర్టు సింగిల్‌జడ్జి విధించిన నెల రోజుల సాధారణ జైలు శిక్ష అమలును హైకోర్టు ధర్మాసనం మూడు వారాల పాటు నిలిపివేసింది.

Published : 08 Dec 2023 02:41 IST

ఈనాడు, అమరావతి: కోర్టుధిక్కరణ కేసులో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌లకు హైకోర్టు సింగిల్‌జడ్జి విధించిన నెల రోజుల సాధారణ జైలు శిక్ష అమలును హైకోర్టు ధర్మాసనం మూడు వారాల పాటు నిలిపివేసింది. రిట్‌ అప్పీలులో ధర్మాసనం ఇచ్చే తీర్పును బట్టి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ ఎం.కిరణ్మయిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ ఉత్తర్వులిచ్చింది. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లను (అన్‌ఎయిడెడ్‌ లెక్చరర్లు).. ఎయిడెడ్‌ కళాశాలల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ 2022 జులై 26న సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. ఇది అమలు కాకపోవడంతో కోర్టుధిక్కరణ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారణ జరిపిన న్యాయమూర్తి.. అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయలేదంటూ నెల రోజుల జైలుశిక్ష, జరిమానా విధించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ఐఏఎస్‌లు దాఖలు చేసిన అప్పీల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని