‘కూర్చుంటే ఒకటి.. నడిస్తే ఒకటి..’ చినజీయర్‌ స్వామి వ్యంగ్యాస్త్రాలు

ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను బద్ధకస్తులుగా మారుస్తున్నాయని చినజీయర్‌ స్వామి విమర్శించారు.

Updated : 08 Dec 2023 09:31 IST

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను బద్ధకస్తులుగా మారుస్తున్నాయని చినజీయర్‌ స్వామి(Chinna Jeeyar Swamy) విమర్శించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో విజయ డెయిరీ నూతన యూనిట్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాలు రకరకాల రాయితీలు ఇస్తున్నాయి. పుడితే ఒకటి, పోతే ఒకటి, కూర్చుంటే ఒకటి, నడిస్తే ఒకటి, పడుకుంటే మరొకటి, తింటే రాయితీ, తినకపోతే రాయితీ.. ఇలా ప్రతిదానికీ రాయితీలు ఇస్తూ ప్రజల్ని బద్ధకస్తులుగా, బలహీనులుగా తయారు చేస్తున్నారు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అన్నీ మన ఇంటికే తెచ్చిస్తుంటే ఇంకా పనెందుకు అనే ధోరణిలో ప్రజలు ఉన్నారని చినజీయర్‌ స్వామి అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని