అవే పనులు.. 2 సార్లు శంకుస్థాపనలు

దుర్గగుడిలో అన్నదాన భవనం, కేశఖండనశాల, ప్రసాదం పోటు, కనకదుర్గానగర్‌ ప్రవేశం వద్ద రాజద్వారంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ గురువారం శంకుస్థాపన చేశారు.

Published : 08 Dec 2023 03:53 IST

దుర్గగుడిలో అన్నదాన భవనం, కేశఖండనశాల, ప్రసాదం పోటు, కనకదుర్గానగర్‌ ప్రవేశం వద్ద రాజద్వారంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ గురువారం శంకుస్థాపన చేశారు. ఇవే పనులకు దాదాపు మూడేళ్ల కిందట (2021 జనవరి 8న) కూడా ముఖ్యమంత్రి జగన్‌ శంకుస్థాపనలు చేశారు. అప్పట్లో దేవాదాయశాఖ మంత్రిగా వెలంపల్లి శ్రీనివాసరావు రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులతో పనులు ప్రతిపాదించారు. ఆయన స్థానంలో కొట్టు సత్యనారాయణ మంత్రిగా పదవి చేపట్టగానే గతంలో వేసిన ప్రణాళికల్ని పక్కన పెట్టేశారు. మళ్లీ కొత్తగా రూ.లక్షలు ఖర్చు పెట్టి నమూనాలు తయారు చేయించారు. ఇప్పుడు బడ్జెట్‌ను మూడు రెట్లు పెంచి మరికొన్ని పనులను  కలిపి మళ్లీ ముఖ్యమంత్రి జగన్‌తో గురువారం శంకుస్థాపన చేయించడం గమనార్హం. 

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని