గుంతల దారుల్లో కూరుకుపోతున్నా పట్టించుకోరేం?

రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.

Published : 08 Dec 2023 04:05 IST

రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి- తెర్లాం ప్రధాన రహదారిపై గొల్లపల్లి వద్ద ఉన్న గోతుల్లో గురువారం రెండు లారీల చక్రాలు కూరుకుపోయాయి. సుమారు ఐదు గంటలపాటు ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చక్రాల ఇరుసులు విరిగిపోవడంతో భారీ క్రేన్ల సాయంతో లారీలను బయటకు తీశారు. పారాది వంతెన కుంగిపోయిన నేపథ్యంలో భారీ వాహనాలను తెర్లాం మీదుగా మళ్లించడంతో రహదారులు పూర్తిగా పాడయ్యాయి. గతనెల 25న ఇదే గొయ్యిలో భారీ వాహనం కూరుకుపోయి, రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం ఇందిరానగర్‌ వద్ద ఉన్న గుంతలో గురువారం లారీ ఇరుక్కుపోయింది. దీంతో పార్వతీపురం- కూనేరు ప్రధాన రహదారిపై గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

న్యూస్‌టుడే, బొబ్బిలి, కొమరాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని