ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై రూ.216 కోట్లతో చేపట్టబోతున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.

Published : 08 Dec 2023 04:07 IST

శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-ఇంద్రకీలాద్రి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రూ.216 కోట్లతో చేపట్టబోతున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. కొండ దిగువన కనకదుర్గానగర్‌లో ఏర్పాటు చేసిన 19 శిలాఫలకాలను దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, హోం మంత్రి తానేటి వనితలతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.57 కోట్లు, దేవస్థానం నిధులు రూ.121.05 కోట్లు, దాతల సాయం రూ.5 కోట్లు, దేవస్థానం, ప్రైవేటు భాగస్వామ్యం రూ.33 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి ఈ శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం పూర్ణకుంభ స్వాగతంతో ఆలయ వేదపండితులు సీఎం జగన్‌ను అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో కె.ఎస్‌.రామారావు, నగర మేయర్‌ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు