‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకావిష్కరణ

ఆస్ట్రేలియా గడ్డపై తెలుగువారి ప్రస్థానానికి ప్రతిబింబమే ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకమని రచయిత మల్లికేశ్వరరావు కొంచాడ తెలిపారు.

Published : 08 Dec 2023 04:41 IST

ఈనాడు, దిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగువారి ప్రస్థానానికి ప్రతిబింబమే ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకమని రచయిత మల్లికేశ్వరరావు కొంచాడ తెలిపారు. తెలుగు వారు ఆ ఖండానికి చేరి అరవై ఏళ్లు పూర్తయిందని, ఆ సందర్భంగా ఈ పుస్తకాన్ని తీసుకువచ్చానని ఆయన వివరించారు. దిల్లీలో కేంద్ర సాహిత్య అకాడెమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, సుప్రీంకోర్టు న్యాయవాది రాజగోపాలరావు గురువారం ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రచయిత మల్లికేశ్వరరావు మాట్లాడుతూ తాను 1996లో న్యూజిలాండ్‌కు, తర్వాత 2001లో ఆస్ట్రేలియాకు వెళ్లానని తెలిపారు. నాటి నుంచి అక్కడి తెలుగు వారి ప్రస్థానాన్ని గమనిస్తున్నానని, ఈ క్రమంలోనే ఈ పుస్తకం రచించానని తెలిపారు. ఆస్ట్రేలియాలో తెలుగువారి ప్రస్థానం, అక్కడి తెలుగు ప్రముఖులు, తెలుగు సంస్థల కృషి తదితరాల గురించి వివరించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని