Govt schools in AP: సర్కారు వారి.. తడికెల బడి

ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కనున్న మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల. గతంలో 140 మంది విద్యార్థులుండగా, శిథిలమైన భవనంలోకి పిల్లలను పంపించలేమని తల్లిదండ్రులు మాన్పించారు.

Updated : 09 Dec 2023 06:50 IST

న్యూస్‌టుడే, సత్తెనపల్లి: ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కనున్న మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల(Govt schools in AP). గతంలో 140 మంది విద్యార్థులుండగా, శిథిలమైన భవనంలోకి పిల్లలను పంపించలేమని తల్లిదండ్రులు మాన్పించారు. ప్రస్తుతం 82 మంది చదువుతున్నారు. ఒకే గదిలో అన్ని తరగతులు నిర్వహించలేక, కొందరికి ఇలా వరండాలో తడికెలు అడ్డుపెట్టి పాఠాలు చెబుతున్నారు. నాడు-నేడు తొలి విడతలోనే ఈ సమస్యను గుర్తించినా అభివృద్ధి చేయలేదు. రెండో విడతలో 2 గదుల నిర్మాణానికి రూ.24 లక్షలు కేటాయించి, తర్వాత రూ.12 లక్షలకు తగ్గించారు. దీంతో ఒకే గది నిర్మించారు. నిధుల కొరతతో రెండో గది పనులు ఆగిపోయి విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని