అగ్నిప్రమాద బాధిత మత్స్యకారులకు తెదేపా రూ.60 లక్షల సాయం

విశాఖ చేపలరేవులో సంభవించిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు తెదేపా అధికారంలోకి రాగానే కొత్త బోట్లు ఇస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.

Published : 09 Dec 2023 04:41 IST

పార్టీ అధికారంలోకి రాగానే కొత్త బోట్లు అందజేస్తాం: అచ్చెన్నాయుడు

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖ చేపలరేవులో సంభవించిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు తెదేపా అధికారంలోకి రాగానే కొత్త బోట్లు ఇస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. చేపలరేవు సమీపంలో శుక్రవారం నిర్వహించిన సభలో బాధితులకు తెదేపా రూ.60 లక్షల ఆర్థికసాయం అందజేసింది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బాధిత మత్స్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వస్తే గంగవరం పోర్టు వద్ద మినీ జెట్టీ నిర్మిస్తామని, ఆయిల్‌ రాయితీ పెంచుతామని, బోట్లు, వలలు అందజేస్తామని వివరించారు. పార్టీ దక్షిణ నియోజకవర్గ బాధ్యుడు గండి బాబ్జీ నేతృత్వం వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ నజీర్‌, మాజీ ఎమ్మెల్యే కొండబాబు, విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ బాధ్యుడు శ్రీభరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని