తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ నారాయణ

మిగ్‌జాం తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు.

Published : 09 Dec 2023 04:46 IST

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి, బాధిత రైతులతో మాట్లాడారు. తుపాను వల్ల ప్రజల తీవ్ర అవస్థలు పడ్డారని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని