Rajamahendravaram: మళ్లీ కుంగింది.. రోడ్డుపై 15 అడుగుల పొడవున భారీ గుంత!

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధి గోరక్షణపేట మార్గంలో ఆదివారం రహదారి ఇలా కుంగింది.

Published : 11 Dec 2023 08:44 IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం (Rajamahendravaram) నగరపాలక సంస్థ పరిధి గోరక్షణపేట మార్గంలో ఆదివారం రహదారి ఇలా కుంగింది. 15 అడుగుల పొడవున భారీ గుంత పడింది. లోపల పైపులైన్‌ పగిలిపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది. గతంలో ఓసారి ఇలాగే జరగడంతో మరమ్మతు చేసి కొత్తగా రోడ్డు వేశారు. ప్రస్తుతం మళ్లీ అదే రోడ్డు కుంగింది. ఈ మార్గంలోనే ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి కాకినాడ, తుని, విశాఖపట్నం వెళ్లే బస్సులతోపాటు పెద్ద సంఖ్యలో ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. తెల్లవారుజామున సంఘటన జరగడంతో రద్దీ తక్కువగా ఉండి పెనుప్రమాదం తప్పింది. నాణ్యత లేని పనులు చేయించి ప్రాణాలతో యంత్రాంగం చెలగాటమాడుతోందని నగరవాసులు వాపోతున్నారు.

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని