పంపా రిజర్వాయర్‌.. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే మరో గుండ్లకమ్మే

కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలోని పంపా రిజర్వాయర్‌ వరద గేట్ల నిర్వహణ, మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రకాశం జిల్లా గుండ్లకమ్మకు ఎదురైన అనుభవమే ఇక్కడా తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated : 12 Dec 2023 09:02 IST

అన్నవరం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలోని పంపా రిజర్వాయర్‌ వరద గేట్ల నిర్వహణ, మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రకాశం జిల్లా గుండ్లకమ్మకు ఎదురైన అనుభవమే ఇక్కడా తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల వచ్చిన తుపాను వల్ల పంపా రిజర్వాయర్‌లోకి భారీగా నీరు చేరడంతో వరదగేట్లు పైకి ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలారు. ఆ సమయంలో రెండో నంబరు గేటును పైకి ఎత్తే సమయంలో నాలుగో నంబరు గేటు కిందనున్న వెల్డింగ్‌ ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో ఈ గేటు నుంచి బయటకు నీరు భారీగా వచ్చింది. రోలర్లు ట్రాక్‌ తప్పాయి. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీరు ఉండటంతో గేటు కింద వెల్డింగ్‌ చేయడం వీలు కాదు. రిజర్వాయర్‌ నిర్మించి అర్ధశతాబ్దం దాటడంతో నిర్లక్ష్యం చేస్తే గేటు ఊడిపోయే అవకాశాలున్నాయి. కొత్త గేట్ల ఏర్పాటు, ఇతర మరమ్మతుల కోసం ప్రభుత్వానికి నివేదించామని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని