Tirumla: శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాల మూసివేత

పొగమంచు, వర్షం కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను తితిదే మూసివేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆ మార్గాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది.

Updated : 16 Dec 2023 06:42 IST

తిరుమల, న్యూస్‌టుడే: పొగమంచు, వర్షం కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను తితిదే మూసివేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆ మార్గాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. పొగమంచుతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆలయం సమీపంలోని భక్తులతోపాటు ఘాట్‌ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. అలిపిరి మార్గంలో వెళ్లే వాహనదారులను తితిదే సిబ్బంది అప్రమత్తం చేస్తూ పంపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు