Tirumala: దర్శన టికెట్లు ఉన్న భక్తులకే గదులు.. మొదటిసారి తితిదే ప్రయత్నం

తితిదే ఏప్రిల్‌ మాసానికి సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌లైన్‌లో చేపట్టింది.

Published : 25 Jan 2024 05:15 IST

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే ఏప్రిల్‌ మాసానికి సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌లైన్‌లో చేపట్టింది. శ్రీవారి ఆర్జిత సేవలు, లక్కీడిప్‌, వృద్ధులు, దివ్యాంగులు, శ్రీవాణి ట్రస్టు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే ఈ నెల 18 నుంచి బుధవారం వరకు జారీ చేసింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్‌ఈడీ) టికెట్లను భక్తులు 2 గంటల 45 నిమిషాల్లోనే కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని