YSRCP: ఇక సభల నుంచి ఎలా వెళ్తారో చూస్తాం!

ప్రభుత్వం, పాలకపక్షం నిర్వహించే సభల నుంచి ప్రజలు వెనుదిరుగుతుండటంతో అధికారులు రూటు మార్చారు. కార్యక్రమం పూర్తయ్యే వరకూ ఎవరూ వెళ్లకుండా చూసుకునేందుకు పోలీసులను, కొంత మందిని మోహరిస్తున్నారు.

Updated : 25 Jan 2024 05:19 IST

ప్రభుత్వం, పాలకపక్షం నిర్వహించే సభల నుంచి ప్రజలు వెనుదిరుగుతుండటంతో అధికారులు రూటు మార్చారు. కార్యక్రమం పూర్తయ్యే వరకూ ఎవరూ వెళ్లకుండా చూసుకునేందుకు పోలీసులను, కొంత మందిని మోహరిస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో బుధవారం ఆసరా నిధుల పంపిణీ సభలు నిర్వహించారు. అమలాపురం జి.ఎం.సి.బాలయోగి క్రీడా మైదానంలో నిర్వహించినసభ నుంచి మహిళలెవరూ వెళ్లిపోకుండా ఉండేందుకు డ్వాక్రా యానిమేటర్లు సభ చివరి వరుసలో బౌన్సర్ల మాదిరి నిల్చొన్నారు. వెళ్లిపోతున్న వారిని కనిపెట్టి గద్దించి, గొడవపడి మరీ కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. కావలిలో మహిళలు వెళ్లిపోకుండా ఆ ప్రాంగణానికి ఉన్న మూడు వైపులా గేట్లు వేసి, పోలీసులను కాపలా పెట్టారు. ఉదయం ప్రారంభమైన సభ మధ్యాహ్నం రెండైనా పూర్తికాకపోవడంతో సభకు వచ్చిన మహిళలు వెళ్లిపోయేందుకు పోలీసులను వేడుకొంటూ కనిపించారు.

న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం, కావలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు