Minister Dharmana: ఏయ్‌ జడ్డి మాలోకం.. చెప్పేది వింటున్నావా?

శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామంలో బుధవారం ఆసరా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తున్న సమయంలో.. అది వినకుండా కొందరు మహిళలు మాట్లాడుకుంటుండడంతో వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Updated : 25 Jan 2024 05:41 IST

మహిళలపై మంత్రి ధర్మాన అసహనం

కలెక్టరేట్ (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామంలో బుధవారం ఆసరా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasada Rao) రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తున్న సమయంలో.. అది వినకుండా కొందరు మహిళలు మాట్లాడుకుంటుండడంతో వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఏయ్‌ జడ్డి మాలోకం.. చెప్పేది వింటున్నావా.. ఇంత దూరం వచ్చారు, ఏం వింటున్నారు. ఇది మీ కుటుంబానికి సంబంధించిన సమస్య అని తెలుసుకోండి. ఒకసారి ఓటు వేస్తే అయిదేళ్లు ఏం జరిగిందో చూశారు. అందరూ ఇళ్లల్లో దర్జాగా బతుకుతున్నారు. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు పిచ్చివారిలా ఉండకూడదు. ఇది ప్రభుత్వాన్ని ఎన్నుకునే నిర్ణయం. వాలంటీరు వ్యవస్థ ఉండాలంటే వైకాపాకే మద్దతు ఇవ్వాలి. గ్రామాల్లో ఉన్న మనస్పర్ధలు మాపై పెట్టకూడదు. ఆడవాళ్లకు ఇళ్లలో గౌరవం ఉండాలని అన్ని కార్యక్రమాలు వారి పేరు మీదుగానే అమలు చేస్తున్నాం.’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని