అయ్యో.. అడవిలా అమరావతి

నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతిని వైకాపా సర్కారు అడవిలా మార్చేసింది. తెదేపా ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ హంగులతో, దేశానికే తలమానికంగా చిరకాలం నిలిచిపోయేలా అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు.

Published : 11 Feb 2024 06:16 IST

వ్యాంధ్ర కలల రాజధాని అమరావతిని వైకాపా సర్కారు అడవిలా మార్చేసింది. తెదేపా ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ హంగులతో, దేశానికే తలమానికంగా చిరకాలం నిలిచిపోయేలా అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు. రాత్రింబవళ్లు వేల మంది కూలీలతో భారీ ఎత్తున భవన నిర్మాణాలు సాగేవి. వైకాపా అధికారంలోకి వచ్చాక... అమరావతిపై కక్షకొద్దీ నిర్మాణాల్ని సీఎం జగన్‌ నిలిపేశారు. ప్రస్తుతం అమరావతిలో రహదారులు, పునాదులు కనిపించనంతగా పిచ్చిమొక్కలు, కంపచెట్లు పెరిగిపోయాయి. శాశ్వత సచివాలయ టవర్ల పునాదుల చుట్టూ వర్షం నీరు చేరి చెరువుల్ని తలపిస్తోంది.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని