ఎన్ని నోటీసులు ఇచ్చినా చలో విజయవాడ నిర్వహించి తీరుతాం

రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారశైలి కారణంగా ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి, నిరసన కార్యక్రమాలు చేయాల్సి వస్తోందని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు వెల్లడించారు.

Updated : 22 Feb 2024 07:24 IST

ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారశైలి కారణంగా ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి, నిరసన కార్యక్రమాలు చేయాల్సి వస్తోందని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు వెల్లడించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా తమ లక్ష్యం నెరవేరేవరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఏపీ ఐకాస ఈనెల 27 నిర్వహించనున్న ‘చలో విజయవాడ’ పోస్టర్‌ను బుధవారం విజయవాడలోని ఎన్జీఓ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వాన్ని కొత్తగా ఏమీ కోరడం లేదు. మేం దాచుకున్న డబ్బులు ఇస్తే చాలని మాత్రమే అడుగుతున్నాం. చలో విజయవాడకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం నిధులు ఇస్తే నోటీసులు ఇచ్చే పని ఉండదు కదా? చలో విజయవాడ జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భయపడుతోందా? ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గురువారం నుంచి రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా పర్యటించనుంది’’ అని తెలిపారు.

నాయకులకు పోలీసుల ముందుస్తు నోటీసులు

ఏపీ ఐకాస ఈ నెల 27న నిర్వహించనున్న ‘చలో విజయవాడ’కు అనుమతి లేదంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. అంతకు ముందు ఇంటెలిజెన్స్‌ విభాగానికి చెందిన ఓ కీలక అధికారి నాయకులతో సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ఎలా చేస్తారని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని