అటు దాడులు.. ఇటు తాయిలాలు!

రాష్ట్రంలో వైకాపా నేతలు ఓ వైపు పాత్రికేయులపై దాడులకు తెగబడుతూ.. మరోవైపు వారిని మచ్చిక చేసుకునేందుకు చూస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని జిల్లాల్లోనూ తాయిలాలు ఎరవేస్తున్నారు.

Published : 22 Feb 2024 07:15 IST

పాత్రికేయులకు వైకాపా నేతల కానుకల ఎర

కాకినాడ, సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా నేతలు ఓ వైపు పాత్రికేయులపై దాడులకు తెగబడుతూ.. మరోవైపు వారిని మచ్చిక చేసుకునేందుకు చూస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని జిల్లాల్లోనూ తాయిలాలు ఎరవేస్తున్నారు. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గం ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తన నియోజకవర్గంలోని కాకినాడ గ్రామీణం, కరప మండలాల పాత్రికేయులతో బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం 80 మందికి విందు భోజనం పెట్టి, చీరతో పాటు షర్టు, ప్యాంటు వస్త్రాల కిట్లను అందించారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సురేష్‌ కూడా మూడు రోజుల క్రితం సింగరాయకొండలోని సింగరాయకొండ, జరుగుమల్లి, టంగుటూరు మండలాల పాత్రికేయులకు ఇవే తరహా కిట్లను అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని