వైద్య విద్యలో ఏఐ ప్రవేశపెట్టేందుకు పరిశీలన చేయండి

వైద్య విద్యలో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలపై పరిశీలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

Published : 22 Feb 2024 04:33 IST

అధికారులకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశం

ఈనాడు-అమరావతి: వైద్య విద్యలో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలపై పరిశీలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. రోబో అసిస్టెంట్‌ సర్జరీలు, డ్రగ్‌ డోసెజ్‌ అండ్‌ డెలివరీ, అరుదైన వ్యాధుల గుర్తింపు వంటి అంశాల్లో కృత్రిమ మేధ ఎంతవరకు ఉపయోగపడుతుందో అధ్యయనం చేసి, నివేదించాలని పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ వైద్య సంస్థల్లో కృత్రిమ మేధ విధానాలను ఇప్పటికే అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. కౌమార బాలికల్లో రక్తహీనతను నియంత్రించేందుకు వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా కృషి చేయాలని చెప్పారు. గ్రామాల్లో దీర్ఘకాలిక రోగులకు అందజేస్తున్న మందుల పంపిణీ ప్రక్రియను మరింత పటిష్ఠం చేయాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో అదనపు ప్రయోజనాలు కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు తెలియజేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని