తెదేపా మ్యానిఫెస్టోలో స్త్రీలకు ప్రాధాన్యం ఇవ్వండి

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు, అకృత్యాలను అరికట్టడం.. స్త్రీ సంక్షేమం కోసం తెదేపా ఎన్నికల ప్రణాళికలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని మహిళా సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు కోరారు.

Published : 22 Feb 2024 04:34 IST

మహిళా సంఘాల ఐక్య వేదిక వినతి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు, అకృత్యాలను అరికట్టడం.. స్త్రీ సంక్షేమం కోసం తెదేపా ఎన్నికల ప్రణాళికలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని మహిళా సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు కోరారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కమిటీ వేసి నేరాలకు దారితీస్తున్న కారణాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రికి బుధవారం వారు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో అమలవుతున్న మద్యం విధానం వల్ల మహిళలు నష్టపోతున్నారని, మండలానికి ఒక మద్యం దుకాణం మాత్రమే ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద రూ.20 లక్షల రుణం హామీ ఇవ్వాలని విన్నవించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మహిళా నేతలు దుర్గాభవాని, రమాదేవి, సుంకర పద్మశ్రీ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని