ప్రవాస భారతీయుడు మన్నం వెంకటరమణ మృతి

ప్రవాస భారతీయుడు మన్నం వెంకటరమణ బుధవారం గుండెపోటుతో మరణించారు. వారం కిందట అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరిన ఆయన.. మార్గమధ్యంలో గుండెపోటుకు గురయ్యారు.

Published : 22 Feb 2024 04:34 IST

ఈనాడు, అమరావతి: ప్రవాస భారతీయుడు మన్నం వెంకటరమణ బుధవారం గుండెపోటుతో మరణించారు. వారం కిందట అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరిన ఆయన.. మార్గమధ్యంలో గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు సీపీఆర్‌ చేసిన విమానాన్ని వెంటనే సమీపంలోని ఏథెన్స్‌(గ్రీస్‌) విమానాశ్రయానికి తీసుకెళ్లి అక్కడి ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతున్న వెంకటరమణ బుధవారం సాయంత్రం 5.12 గంటలకు మృతి చెందారు. అమెరికాలో ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా తరఫున పనిచేయాలని, ఎన్నికలు ముగిసే వరకూ భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకుని బయల్దేరారని సన్నిహితులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని