83% పైగా పోలింగే లక్ష్యం

రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83% పైగా పోలింగ్‌ నమోదే లక్ష్యంగా ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు.

Published : 22 Feb 2024 04:35 IST

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83% పైగా పోలింగ్‌ నమోదే లక్ష్యంగా ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. మంగళవారం ఆయన ఓటర్ల చైతన్య కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ముకేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 79.77%, జాతీయ స్థాయిలో 69% పైగా పోలింగు నమోదైంది. పోలింగు నమోదు పెంపు లక్ష్యంగా కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి ఓటరుకు ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించడానికి అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే అన్ని జిల్లాల ఎన్నికల, స్వీప్‌ నోడల్‌ అధికారులను అప్రమత్తం చేశాం. జిల్లాల వారీగా స్వీప్‌ కార్యక్రమాల నిర్వహణపై సమీక్షలు చేస్తున్నట్లు భారత ఎన్నికల కమిషన్‌కూ తెలియజేశాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని