Chittoor: బాబ్బాబు సర్దుబాటు చేయరూ.. సీఎం చిత్తూరు జిల్లా పర్యటనకు నిధుల్లేక అధికారుల సతమతం

సీఎం జగన్‌.. చిత్తూరు జిల్లా పర్యటనకు నిధులు లేకపోవడంతో యంత్రాంగం ఆపసోపాలు పడుతోంది.

Updated : 23 Feb 2024 09:30 IST

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సీఎం జగన్‌.. చిత్తూరు జిల్లా పర్యటనకు నిధులు లేకపోవడంతో యంత్రాంగం ఆపసోపాలు పడుతోంది. ముఖ్యమంత్రి ఈ నెల 26న కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.  రామకుప్పం మండలం రాజుపేటలో ఒక హెలిప్యాడ్‌, శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లిలో మరొకటి, బహిరంగ సభ వద్ద, ఇతర చోట్ల కొన్ని పనులు చేయాల్సి ఉంది. ఏర్పాట్లకు రూ.2 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. వీటికి సరిపడా నిధులు లేకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. జిల్లా గృహ నిర్మాణ సంస్థ ఖాతాలో ఉన్న నిధులను కలెక్టర్‌ ఖాతాకు బదిలీ చేసేలా ఆదేశాలివ్వాలంటూ జిల్లా ఉన్నతాధికారులు.. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను కోరారు. ఈ నిధుల్ని రీయింబర్స్‌ చేస్తామని పేర్కొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని