మార్చి 1న విశాఖ పర్యటనకు ప్రధాని!

ప్రధాని మోదీ మార్చి 1న విశాఖకు రానున్నట్లు సమాచారం. రూ.26 వేల కోట్ల ఖర్చుతో నవీకరించిన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రిఫైనరీతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయనున్నారు.

Updated : 23 Feb 2024 04:42 IST

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: ప్రధాని మోదీ మార్చి 1న విశాఖకు రానున్నట్లు సమాచారం. రూ.26 వేల కోట్ల ఖర్చుతో నవీకరించిన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రిఫైనరీతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఏయూ మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది.

26న విశాఖలో మైక్రోబయాలజీ ల్యాబ్‌ ప్రారంభం

విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మైక్రోబయాలజీ ల్యాబ్‌ను ప్రధాని మోదీ ఈ నెల 26న ‘వర్చువల్‌’గా ప్రారంభించనున్నారు. గతంలో దీనికి ఉన్న ప్రాంతీయ ఫుడ్‌ ల్యాబొరేటరీ హోదాను కేంద్రం రూ.4.5 కోట్లతో రాష్ట్ర స్థాయికి పెంచింది. అత్యాధునిక పరికరాల కోసం రూ.14 కోట్లను కేటాయించి.. ఇప్పటికే రూ.8 కోట్లను మంజూరు చేసింది. పూర్తిస్థాయిలో పరికరాలు, యంత్రాలు సమకూరితే ఏడాదికి సుమారు 20 వేల ఆహారం, నీటి నమూనాలను పరీక్షించేందుకు వీలు ఏర్పడుతుంది. దీనితో పాటు ప్రభుత్వానికి అదనంగా ఆదాయమూ సమకూరుతుంది. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో, తిరుపతిలోని తితిదే భవనంలోనూ రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.18 కోట్ల చొప్పున విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2.07 కోట్లతో తీసుకువచ్చిన నాలుగు ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్స్‌ ల్యాబ్‌లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని