క్రైస్తవ సదస్సులో జగన్‌ భజన

క్రీస్తును ఆరాధిస్తూ.. ఆయన మార్గాన్ని ప్రబోధించాల్సిన సదస్సును ఫక్తు రాజకీయ వేదికగా మార్చి, జగన్‌ భజనకు ప్రసంగీకులు పోటీపడ్డారు.

Published : 23 Feb 2024 06:05 IST

ఒంగోలులో వైఎస్‌ విమలారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం

ఒంగోలు, న్యూస్‌టుడే: క్రీస్తును ఆరాధిస్తూ.. ఆయన మార్గాన్ని ప్రబోధించాల్సిన సదస్సును ఫక్తు రాజకీయ వేదికగా మార్చి, జగన్‌ భజనకు ప్రసంగీకులు పోటీపడ్డారు. అంతర్జాతీయ సువార్తికురాలి హోదాలో పాల్గొన్న సీఎం జగన్‌ మేనత్త వైఎస్‌ విమలారెడ్డి ప్రభువు పరిచర్య కంటే తన మేనల్లుడైన జగన్‌ నామస్మరణకే అధిక ప్రాధాన్యమిచ్చారు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సౌజన్యం, ఏపీ క్రిస్టియన్‌ మైనారిటీ సెల్‌ సహకారంతో ఒంగోలులోని ఓ ఫంక్షన్‌ హాలులో గురువారం జిల్లాస్థాయి క్రైస్తవ సేవకుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విమలారెడ్డికి ఎమ్మెల్యే బాలినేని తనయుడు ప్రణీత్‌రెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. సదస్సులో ఆమె ప్రసంగిస్తూ.. సీఎం జగన్‌ పాలనతోనే క్రైస్తవులకు అన్నిరకాల ప్రయోజనాలు సమకూరతాయనీ, రానున్న ఎన్నికల్లోనూ క్రైస్తవ సమాజం ఆయనకు అండగా నిలవాలని కోరారు. క్రైస్తవ సంఘాల నిర్వాహకులు, వైకాపా ఎస్సీ సెల్‌ ప్రతినిధులు జగన్‌ పరిపాలనా దక్షతను కీర్తించేందుకు పోటీపడ్డారు. మధ్యాహ్నం ప్రత్యేక విందుతో పాటు ప్రతి పాస్టరుకు రూ.వెయ్యి ఉన్న కవర్‌ అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని