వైవీయూలో విద్యార్థులకు అస్వస్థత

కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయ(వైవీయూ) హాస్టల్‌ విద్యార్థినులు బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారమే ఇందుకు కారణమని వారు తెలిపారు.

Published : 23 Feb 2024 04:23 IST

కలుషిత ఆహారమే కారణం!

కడప(వైవీయూ), న్యూస్‌టుడే: కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయ(వైవీయూ) హాస్టల్‌ విద్యార్థినులు బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారమే ఇందుకు కారణమని వారు తెలిపారు. బాలికల వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినులు బుధవారం మధ్యాహ్నం భోజనం చేశాక.. వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. వీరిలో 50 మంది విశ్వవిద్యాలయ ఆరోగ్య కేంద్రంలో, 22 మంది కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో, మరికొంత మంది ప్రైవేటుగా చికిత్స పొందారు. విద్యార్థులను వీసీ చింతా సుధాకర్‌ పరామర్శించారు. ఆహారాన్ని, తాగు నీటిని పరీక్షల నిమిత్తం పంపామని, నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటన నేపథ్యంలో విశ్వవిద్యాలయంలో విద్యార్థులు గురువారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని