Viveka Murder Case: ఏ3గా ఉంటే ఏ1గా మార్చేశారు

రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్య షబానా ఆరోపించారు.

Updated : 23 Feb 2024 08:03 IST

నా భర్త జైలు నుంచి విడుదల కాకుండా చేస్తున్నారు
వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్య షబానా

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్య షబానా ఆరోపించారు. ఓ అమ్మాయిని కిడ్నాప్‌ చేయడం, మరొకరిపై దాడి చేసిన కేసులకు సంబంధించి దస్తగిరి ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆ కేసుల్లో బెయిల్‌ మంజూరైనా ఆయనను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో దస్తగిరిని ఆయన భార్య షబానా గురువారం ములాఖత్‌లో కలిశారు. బయటకు వచ్చిన అనంతరం ఆమె మాట్లాడారు. ‘ఈ కేసులో పోలీసులు తొలుత ఎఫ్‌ఐఆర్‌లో నా భర్తను ఏ3గా చేర్చారు. బెయిల్‌ వచ్చిన క్రమంలో ఏ1గా మార్చారు. ఆయన బయటకు వస్తే సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో విడుదల కాకుండా చేస్తున్నారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం చెప్పాలని వైకాపా నాయకులు బెదిరిస్తుండటంతో ఆయన భయపడుతున్నారు’ అని షబానా వాపోయారు. తన భర్తను జమ్మలమడుగు శాసనసభ్యుడు సుధీర్‌రెడ్డి, ఎర్రగుంట్ల సీఐ, అప్పటి జమ్మలమడుగు డీఎస్పీలు కుట్రపన్ని జైలుకు పంపించారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని