అభాగ్య బాలల వెలుగు దీపం ‘హీల్‌’

వేలాది మంది విద్యార్థులకు 32 ఏళ్లుగా ఉచిత విద్య, వసతి, వైద్యంతో కూడిన సేవలు అందిస్తున్న ‘హీల్‌’ సంస్థ అభాగ్య బాలల పాలిట వెలుగు దీపమని శాంత బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కె.ఐ.వరప్రసాదరెడ్డి అన్నారు.

Updated : 23 Feb 2024 04:38 IST

శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకుడు వరప్రసాదరెడ్డి

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: వేలాది మంది విద్యార్థులకు 32 ఏళ్లుగా ఉచిత విద్య, వసతి, వైద్యంతో కూడిన సేవలు అందిస్తున్న ‘హీల్‌’ సంస్థ అభాగ్య బాలల పాలిట వెలుగు దీపమని శాంత బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కె.ఐ.వరప్రసాదరెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలోని ఆ సంస్థ ప్రాంగణంలో గురువారం ఉన్నత విద్యా అకాడమీ, అలేఖ్య కృత్రిమ మేధా కేంద్రం, ప్రతిపాదిత డీమ్డ్‌ విశ్వవిద్యాలయ భవనాలకు శంకుస్థాపన, హీల్‌ సెంటర్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ ఎక్సలెన్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరప్రసాదరెడ్డి, దాతలు దుర్గాదేవి కోవెలమూడి, వేగె శ్రీనివాసరావు, వాణి, యలమంచలి శుభాకర్‌లు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. అత్యాధునిక వసతులు కల్పిస్తూ వేలాది మంది అనాథ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న హీల్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కోనేరు సత్యప్రసాద్‌ సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హీల్‌ ఉపాధ్యక్షుడు జీడీవీ ప్రసాదరావు, కార్యదర్శి తాతినేని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు