పోర్టులు, విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలి: సీఎస్‌ జవహర్‌రెడ్డి

పోర్టుల నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Updated : 23 Feb 2024 05:58 IST

ఈనాడు, అమరావతి: పోర్టుల నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రెవెన్యూ శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు చేయాలని సూచించారు. భోగాపురం విమానాశ్రయం, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట ఓడరేవుల నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో ఆయన గురువారం సమీక్షించారు. ‘భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఈ ఏడాదిలో అక్కడి నుంచి విమానాలు రాకపోకలు సాగించేలా పనులు చేయాలి. భూసేకరణ, ఆర్థికపరమైన అంశాలపై దృష్టి సారించాలి. ప్రభుత్వం నిర్మిస్తున్న మూడు ఓడ రేవులు, చేపల రేవుల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి’ అని పేర్కొన్నారు. రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులు 45 శాతం పూర్తయ్యాయని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ తెలిపారు. పనుల పురోగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని