ఆర్టీఐ కమిషనర్‌గా ఉదయ్‌ భాస్కర్‌రెడ్డి

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్‌గా డాక్టర్‌ అల్లారెడ్డి ఉదయ్‌ భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది.

Published : 24 Feb 2024 04:22 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్‌గా డాక్టర్‌ అల్లారెడ్డి ఉదయ్‌ భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారని పేర్కొంది. ఇదివరకే ఆర్టీఐ కమిషనర్లుగా రెహానా బేగం, చావలి సునీల్‌ల నియామకానికి సంబంధించి గురువారం ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా వాటిని గెజిట్‌లో పెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని