టెట్‌ హాల్‌టికెట్లు విడుదల

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు 2,67,559 మంది దరఖాస్తు చేశారని, హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

Published : 24 Feb 2024 04:23 IST

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు 2,67,559 మంది దరఖాస్తు చేశారని, హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ చేసిన వారు అనర్హులని హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థుల ఫీజును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించింది. పరీక్ష కేంద్రాల కేటాయింపుపై ఎలాంటి సందేహాలున్న జిల్లా విద్యాధికారి(డీఈఓ) కార్యాలయంలో సంప్రదించాలని సూచించింది. అభ్యర్థుల కోసం సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 9505619127, 9705655349, 8121947387, 8125046997 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని