ప్రశ్నపత్రాలు వాట్సప్‌లో పంపుతాం.. బోర్డుపై రాసేయండి!

పాఠశాలలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నామని ఓ వైపు సీఎం జగన్‌ ఊదరగొడుతుంటే.. పరీక్షలకు కనీసం ప్రశ్నపత్రాలూ ఇవ్వలేకపోతున్నారు.

Published : 24 Feb 2024 07:01 IST

ఫార్మెటివ్‌ పరీక్షల్లో వింత పరిస్థితి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పాఠశాలలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నామని ఓ వైపు సీఎం జగన్‌ ఊదరగొడుతుంటే.. పరీక్షలకు కనీసం ప్రశ్నపత్రాలూ ఇవ్వలేకపోతున్నారు. వాటిని వాట్సప్‌లో పంపుతాం.. ప్రశ్నలు బోర్డుపై రాసేయండని అధికారులు ఉపాధ్యాయులకు సూచిస్తున్నారు. ప్రశ్నపత్రాల ముద్రణకు రూ.30 కోట్లు ఇవ్వలేక పాలకులు చోద్యం చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌-4 పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులపాటు జరిగే పరీక్షలకు ప్రశ్నపత్రాలను వాట్సప్‌లో పంపిస్తున్నారు. వీటిని చూసి, ఉపాధ్యాయులు ప్రశ్నలను బోర్డుపై రాయాల్సి వస్తోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 60 మార్కుల ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలు బోర్డు రాయాలంటే ఉపాధ్యాయులకూ కష్టంగానే ఉంది. పైగా ఇందుకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. ఆ తర్వాత విద్యార్థులు సమాధానాలు రాసేందుకు సమయమే ఉండడం లేదు. కొన్ని సార్లు పరీక్ష కంటే ముందే ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇలాంటి పరీక్షలతో విద్యార్థి సామర్థ్యాన్ని ఎలా అంచనా వేయాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయులే సొంత డబ్బులతో ప్రశ్నపత్రాలు జిరాక్స్‌ తీసి పిల్లలకు ఇస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని