ఉద్యోగుల సెలవులపై ప్రభుత్వ ఆంక్షలు

ప్రభుత్వ ఉద్యోగుల సెలవులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలు అమలు కీలక దశలో ఉన్నందున ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుల మంజూరు విషయంలో ఉన్నతాధికారులు విచక్షణతో వ్యవహరించాలని పేర్కొంటూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్‌) రేవు ముత్యాలరాజు ఆదేశాలు జారీ చేశారు.

Published : 24 Feb 2024 04:26 IST

ఫిబ్రవరి, మార్చిల్లో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయంటూ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల సెలవులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలు అమలు కీలక దశలో ఉన్నందున ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుల మంజూరు విషయంలో ఉన్నతాధికారులు విచక్షణతో వ్యవహరించాలని పేర్కొంటూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్‌) రేవు ముత్యాలరాజు ఆదేశాలు జారీ చేశారు. ‘‘నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు, రైతు భరోసా, విద్యా దీవెన, ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల, వైఎస్సార్‌ చేయూత తదితర కార్యక్రమాల అమలు ఉన్నందున ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రభుత్వ యంత్రాంగం హాజరు కీలకం. ఆదాయ ఆర్జన విభాగాలు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తమ లక్ష్యాలు చేరుకోవాలి. సచివాలయంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు, జిల్లాల్లోని అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు సెలవులు మంజూరు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. పనుల్లో జాప్యం జరగకుండా, సరిపడా సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలి’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని